: గాంధీ అడుగు జాడల్లో నడచిన మండేలా


'నల్లజాతి సూరీడు' బిరుదాంకితుడు నెల్సన్ రోలిహ్ లహ్లా మండేలా. అఖండ భారతావనికి స్వాతంత్ర్య ఫలం కోసం ఉద్యమించిన మహాత్మాగాంధీ స్ఫూర్తిగా అహింస, సత్యాగ్రహం అయుధాలతో నల్లజాతిపై వివక్షను తుడిచిపెట్టిన పోరాట కిరణం. ఉదయించే సూరీడుని ఎవరూ ఆపలేరన్నట్లుగా మండేలాను 27 ఏళ్లు జైల్లో ఉంచినా పోరాటం ఆగలేదు.

1990లో జైలు నుంచి విడుదలైన మండేలాకు భారత్ భారతరత్న బిరుదును ప్రసాదించింది. అంతకుముందే ఆయన నోబెల్ పురస్కారానికీ ఎంపికయ్యారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయేతరుడు మండేలానే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకుముందు భారత్ లో జన్మించని మదర్ థెరిసా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు ఇవి దక్కాయి. మదర్ థెరిసా లిబియాలో పుట్టినప్పటికీ 21 ఏళ్ల వయసులోనే భారత్ కు విచ్చేసి ఇక్కడి ప్రజల కోసం బతికారు. భారత పౌరసత్వం పొందారు. కనుక ఆమె భారతీయురాలే.

గఫార్ ఖాన్ కూడా భారత ఉపఖండం వ్యక్తే కాబట్టి.. భారతరత్నంగా నిలిచిన తొలి విదేశీయుడు మండేలానే అని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాకు 1994 నుంచి 1999 వరకు తొలి నల్లజాతి అధ్యక్షుడిగా వ్యవహరించిన మండేలా ఆ కాలంలో భారత్ తో బలమైన బంధానికి పునాదులు వేశారు. వాటిపైనే నేడు ఇరు దేశాలు కలసిమెలసి నడుస్తున్నాయి. ఆయనలేని దేశాన్ని దక్షిణాఫ్రికన్లు ఊహించలేకున్నారు. తమ మనసుల నిండా మండేలా స్మృతులు, స్ఫూర్తిని నింపుకున్నారు.

  • Loading...

More Telugu News