: దక్షిణాఫ్రికా 'నల్లసూరీడు' నెల్సన్ మండేలా కన్నుమూత


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లసూరీడు నెల్సన్ మండేలా(95) కన్నుమూశారు. జోహాన్నస్ బర్గ్ లోని ఆయన స్వగృహంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8.50 గంటలకు తుది శ్వాస విడిచారని ఆ దేశాధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

నెల్సన్ మండేలా కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన 18 జులై 1918న దక్షిణాఫ్రికా, కేవ్ ప్రావిన్స్ లోని మెవిజోలో జన్మించారు. నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన ఆయన 27 ఏళ్ల పాటు జైలులో ఉన్నారు. 1993లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1994 నుంచి 1999 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.

  • Loading...

More Telugu News