: రాష్ట్రానికి అదనపు గ్యాస్ కేటాయించండి: మంత్రి పొన్నాల


గ్యాస్ కొరత సమస్య వల్ల ఆంధ్రప్రదేశ్ లో 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో తెలిపారు. గ్యాస్ కొరత, బొగ్గు ధరలు పెరగడంవల్ల భారం పెరిగిందనీ, దాంతో ఆ భారాన్ని వినియోగదార్లపై మోపక తప్పడం లేదనీ పొన్నాల చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు అదనపు గ్యాస్ ను కేటాయించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఈ ఉదయం ప్రారంభమైన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంకు హాజరైన పొన్నాల, ఈ మేరకు రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News