: కుక్కకోసం కోర్టులో పోరు!


ఎక్కడైనా ఆస్తుల కోసం కోర్టుకెక్కడం జరుగుతుంది. అందునా విడాకులు తీసుకున్న జంటల మధ్య ఎక్కువగా జరిగే వివాదాలు ఆస్తుల పంపకాలు, పిల్లల పెంపకం గురించే ఉంటుంది. అలాకాకుండా ఒక శునకం కోసం పోట్లాడుతూ కోర్టుకెక్కడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మన్‌హటన్‌లో వాషింగ్టన్‌ హైట్స్‌కు చెందిన షానన్‌, త్రిషా బ్రిడ్జెట్‌ అనే లెస్బియన్‌ జంట కోర్టుకెక్కారు. విడాకులు తీసుకున్నవారు సాధారణంగా తమ పిల్లల పెంపకానికి సంబంధించి పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలి అనే విషయంగా కోర్టుకు రావడం సహజం. అలాకాకుండా కేవలం రెండేళ్ల వయసున్న ఒక బుల్లి కుక్కకోసం ఈ జంట కోర్టుకెక్కారు. జోయ్‌ అనే పేరున్న ఈ బుల్లి కుక్క కస్టడీకోసం ఈ జంట కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. విడాకులు తీసుకుంటున్న ఒక జంట కేవలం శునకం కస్టడీ కోరుతూ కోర్టుకెక్కడం న్యూయార్కులో ఇదే తొలిసారి అని మన్‌హటన్‌ జడ్జి మాథ్యూ కూపర్‌ చెబుతున్నారు. అందుకే అన్నారు ఎవరి పిచ్చి వారికానందం. ఈ జంటకు పాపం కుక్కపైన ఉన్న అభిమానం కోర్టుదాకా లాక్కొచ్చిందిమరి.

  • Loading...

More Telugu News