: మన శరీరంలో కూడా టైమింగ్‌ ఉందట


మన శరీరంలో కూడా ఒకరకమైన టైమింగ్‌ ఉందట. దీని ఫలితంగా మనం ఒక్కోసారి ఎక్కువ ఆహారం, మరోసారి తక్కువ ఆహారం తీసుకుంటామని పరిశోధకులు గుర్తించారు. ఇలా ఆహారం తీసుకోవడం ఒక దశకొచ్చిన తర్వాత తినడం ఆపేస్తాం. ఇలా ఆహారం తీసుకోవడంలో ఒక పరిమితిని అనుసరించడానికి కారణం మన శరీరంలో ఉండే జీవ గడియారమేనని పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.

అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జీర్ణాశయంలోని నాడులు జీవ గడియారంలాగా పనిచేస్తున్నట్టు తొలిసారిగా తమ పరిశోధనలో గుర్తించారు. ఈ జీవనాడులు కొన్ని సమయాల్లో మనం ఆహారం పరిమితంగా తీసుకునేలా చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మనం ఆహారం తీసుకునే సమయంలో జీర్ణాశయం సాగినప్పుడు అందులోని నాడులు ఎలా స్పందిస్తాయి? అనే విషయంపై డాక్టర్‌ స్టీఫెన్‌ కెంటిష్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో నాడులు మనం ఎంత ఆహారం తీసుకున్నాం? ఎప్పుడు తినడం ఆపాలి? అనే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయని కెంటిష్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News