: సోనియాగాంధీకి తెలంగాణవాదులు రుణపడి ఉన్నారు: జైపాల్ రెడ్డి


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణవాదులంతా రుణపడి ఉన్నారని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదొక చారిత్రక విజయమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఆయన జోహార్లు తెలిపారు. సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు వేర్వేరు కాదని, అందరం తెలుగువారమేనని తెలిపారు. పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంఖ్య, ఇప్పటికంటే ఎక్కువ పెరుగుతుందని అన్నారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News