: 'ప్రపంచ శృంగార మహిళ'గా నాలుగోసారి కత్రినాయే!


బాలీవుడ్ కథానాయిక కత్రినా కైఫ్ 'ప్రపంచ శృంగార మహిళ'గా నాలుగోసారి ఎంపికైంది. ఏడాది నుంచి ఒక్క చిత్రమూ లేని కైఫ్ కే అభిమానులు మరోసారి పట్టం కట్టడం విశేషం. లండన్ లోని 'ఈస్ట్రన్ ఐ' న్యూస్ పేపర్ నిర్వహించిన సర్వేలో కత్రిన తొలి స్థానంలో నిలువగా.. ప్రియాంక చోప్రా, బుల్లితెర నటి ద్రష్టి దామిని, దీపికా పదుకొనే ద్వితీయ, తృతీయ, నాలుగవ స్థానాల్లో నిలిచారు. మొత్తం 50 మంది శృంగార ఆసియా మహిళలతో ఈ జాబితా రూపొందింది. 'ఇది రికార్డు అని నాకు తెలియదు. చాలా ఆశ్చర్యంగా, అనందంగా ఉంది' అని కత్రిన స్పందించింది. ఆషికి-2 ఫేం శ్రద్ధా కపూర్ జాబితాలో 12వ స్థానంతో సరిపెట్టుకుంది. పాకిస్థాన్ నటి హ్యుమైమా మాలిక్ కు 15వ స్థానం దక్కగా, బాలీవుడ్ అలనాటి తారలు మాధురీ దీక్షిత్ (23), శ్రీదేవి (40) కూడా జాబితాలో ఉన్నారు.

  • Loading...

More Telugu News