: హైదరాబాద్ లో బంద్ ప్రశాంతం
రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా హైదరాబాద్ నగరంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్, టీ-జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో ఇవాళ బంద్ జరుగుతోంది. బంద్ లో భాగంగా భాగ్యనగరంలో కోఠి, ఎంజీబీఎస్, అబిడ్స్ సహా పలు ప్రాంతాలు జన సంచారం లేక వెలవెలబోయాయి. బంద్ కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలపడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక నగర వాసులు నానా ఇక్కట్లు పడ్డారు. బస్సులకు ప్రత్యామ్నాయంగా పలువురు ఆటోలను ఆశ్రయించారు. కొన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేశారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం పనిచేస్తున్నాయి.