: భార్యను శూర్పణఖను చేసిన భర్త


శాడిస్టు భర్త పట్టలేని కోపంతో తన భార్యను శూర్పణఖను చేశాడు. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం అల్లాపూర్ కు చెందిన వడ్డే బాలకృష్ణయ్య, వెంకటమ్మ దంపతులు కుటుంబ కలహాల కారణంగా నిన్న గొడవపడ్డారు. దీంతో ఆవేశానికి గురైన బాలకృష్ణయ్య తన భార్య ముక్కు కొరికేశాడు.

దీంతో ఆమె ముక్కు కొనభాగం తెగి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటనతో షాక్ కు గురైన ఆమె బిగ్గరగా కేకలు వేసింది. దీంతో బాలకృష్ణయ్య పారిపోయాడు. ఆమె కేకలు విన్న పొరుగువారు ఆమెను తాండూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని వైద్యులు తెలపడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు.

  • Loading...

More Telugu News