: ఓయూలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులపై దాడికి దిగిన విద్యార్థులు
రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఇవాళ ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు యూనివర్శిటీ ప్రాంగణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ ఎన్సీసీ గేట్ చేరుకునే సరికి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులపై రాళ్లు రువ్వటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రెండు సార్లు భాష్పవాయువును ప్రయోగించారు.
నిన్న (బుధవారం) బైక్ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులను ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే. ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఉస్మానియా వర్శిటీలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.