: అక్బరుద్దీన్ ఒవైసీని అడ్డుకున్న టీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్
మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండల పరిధిలోని జేపీ దర్గా వద్ద చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని ఆందోళనకారులకు అక్బరుద్దీన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు ఆయన మాటలు వినలేదు. చివరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టీఆర్ఎస్, బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్బరుద్దీన్ జేపీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని హైదరాబాదుకు పయనమయ్యారు.