: 'చేప మందు'పై సిటీ సివిల్ కోర్టు తీర్పు


ప్రతి ఏడాది ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు హైదరాబాద్ లో పంపిణీ చేసే చేప మందును ఇక నుంచి చేప ప్రసాదంగా వ్యవహరించాలని సిటీ సివిల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈమేరకు మందు పంపిణీ చేసే చోట తప్పనిసరిగా చేప ప్రసాదం అని బోర్డులు పెట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

పైగా, చేపలో మందు కూరే సమయంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్ తో తనిఖీలు చేయించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ చేపమందుపై జన విజ్ఞాన వేదిక కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు పైవిధంగా తీర్పునిచ్చిందని జన విజ్ఞాన వేదిక కన్వీనర్ టీవీ రావు చెప్పారు. 

  • Loading...

More Telugu News