: రాయల తెలంగాణపై ఆజాద్ వెనకడుగు
రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. పది జిల్లాల తెలంగాణకే సిఫారసు చేయాలని జీవోఎం సహచరులకు మంత్రి గులాంనబీ ఆజాద్ చెప్పారు. అసెంబ్లీలో చర్చ జరిగి అందరూ అంగీకరిస్తే రాయల తెలంగాణ ప్రతిపాదనకు మొగ్గు చూపవచ్చని పేర్కొన్నారు. రాయల తెలంగాణను తెలంగాణ ప్రాంత నేతలు అంగీకరించని పక్షంలో, అది కొత్త సమస్యలకు దారి తీస్తుందని జీవోఎం సభ్యులకు వివరించారు. ఈ క్రమంలో తెలంగాణ, రాయల తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని జీవోఎం కేబినెట్ కే వదిలిపెట్టింది.