: రాహుల్ వారినెందుకు పరామర్శించలేదు?: ఉద్ధవ్ థాకరే
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర భండారా జిల్లాలో దారుణంగా అత్యాచారానికి గురై, మరణించిన ముగ్గురు బాలికల కుటుంబాన్ని రాహుల్ ఎందుకు పరామర్శించలేదని సూటిగా ప్రశ్నించారు.
వారిని పోగొట్టుకొని ఆ కుటుంబం ఎంత ఆవేదన చెందుతోందో తెలియదా? అన్నారు. కొన్నిరోజుల కిందట ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ జిల్లాలో హత్యకు గురైన డీఎస్పీ కుటుంబాన్ని శనివారం రాహుల్ ప్రత్యేకంగా కలుసుకుని.. పరామర్శించారు. ఈ నేపథ్యంలో థాకరే.. రాహుల్ ను తప్పుబట్టారు.
దారుణ ఘటనలో ముగ్గురిని కోల్పోయి, తీవ్ర బాధలో ఉన్న వారి కుటుంబం పట్ల రాహుల్ ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకపోవడం బాధాకరమన్నారు. ముంబయిలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న థాకరే.. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.