: పదా? పన్నెండా? నేడు తేలనున్న 'టీ' భవితవ్యం
రాష్ట్ర విభజన అంశం చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో భేటీలు, ఎన్నో కమిటీలు, ఎన్నో డిమాండ్లు, ఎన్నో నిరసనల అనంతరం తెలంగాణ ముసాయిదా బిల్లు సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న కేంద్ర కేబినెట్ ముందుకు ముసాయిదా బిల్లు రానుంది. అయితే, జీవోఎం తయారు చేసిన 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013'లో ఉన్న మర్మం మాత్రం ఇంత వరకు బయటకు పొక్కలేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణనా? లేక పన్నెండు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణనా? అనే విషయం ఈ సాయంత్రం తేలనుంది. రెండు ఆప్షన్లతో కూడిన ముసాయిదాను జీవోఎం తయారు చేసినట్టు సమాచారం. ఈ రోజు జరగనున్న ఫైనల్స్ లో సోనియా, మన్మోహన్ లే అంపైర్లు. వీరి నిర్ణయం మీదే తెలంగాణ భవితవ్యం ఆధారపడి ఉంది.