: సల్మాన్ ఖాన్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ
నటుడు సల్మాన్ ఖాన్ 2002 సెప్టెంబర్ 28న ముంబైలోని బాంద్రాలో వేగంగా కారు నడుపుతూ ఒకరి మృతికి కారణమైన కేసులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో గత సాక్ష్యాలను తోసిపుచ్చి కొత్తగా విచారణ ప్రారంభించాలని కోరుతూ సల్మాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గత సాక్ష్యాల ఆధారంగా విచారణ కొనసాగించాలా? లేక తాజాగా విచారణ మొదలుపెట్టాలా? అన్నది కోర్టు ఈ రోజు నిర్ణయించనుంది.