: నేడు తెలంగాణ బంద్


రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నేడు తెలంగాణ బంద్ కు టీఆర్ఎస్ పిలుపు నిచ్చింది. ఈ బంద్ కు తెలంగాణ పొలిటికల్ జేఏసీ, బీజేపీ, సీపీఐ మద్దతు ప్రకటించాయి. దీంతో తెలంగాణ అంతటా బంద్ ప్రారంభమైంది. విద్యార్ధి, ఉద్యోగ, కార్మిక సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. పలు డిపోల ఎదుట తెలంగాణ వాదులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జేఎన్‌టీయు పరిధిలో ఈ రోజు జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలను 13 వ తేదీకి వాయిదా వేశారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగవలసిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

  • Loading...

More Telugu News