: ఆ రెండూ దొంగల పార్టీలే: మోత్కుపల్లి
కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ రెండూ దొంగల పార్టీలేనని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు, కాంగ్రెస్ కు బేరం కుదిరాకే రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజలు నిజాం పాలనపై తిరగబడ్డట్టు తిరగబడే రోజు వస్తుందన్నారు. విద్యార్థుల బలిదానాలను ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకోసం కేసీఆర్ ఇచ్చిన బంద్ కు టీడీపీ సహకరించదని మోత్కుపల్లి స్పష్టం చేశారు.