: విశాఖలో ఘనంగా నేవీ డే..అలరించిన యుద్ధవిన్యాసాలు


విశాఖపట్టణంలో నేవీ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పు తీర నావికాదళం ప్రదర్శించిన విన్యాసాలతో సాగరతీరం పులకించిపోయింది. ప్రతి ఏటా డిసెంబర్ 4న జరిగే నేవీ డే సందర్భంగా నావికాదళం ప్రదర్శించే విన్యాసాలకు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ ఏడాది కూడా నావికాదళం విన్యాసాలు వీక్షించేందుకు సాగరతీరం జనసంద్రమైంది. భారీ జన సందోహం మధ్య నీరు, భూమి, గాలిలో నేవీ సైనికులు ప్రదర్శించిన యుద్ధ విన్యాసాలు అందర్నీ అలరించాయి. పారాచూట్లతో సైనికులు యుద్ధభూమిలో దిగడాన్ని కేరింతలతో ఆస్వాదించారు. ఈ ఉత్సవాలకు నేవీకి చెందిన ఉన్నతాధికారులు అతిథులుగా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News