: ట్విట్టర్ లో వైఎస్ విజయమ్మకు నారా లోకేష్ ప్రశ్న


టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా, ఆయన కృష్ణా నదీ మిగులు జలాలపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ప్రశ్నించారు. కృష్ణా మిగులు జలాలు వద్దని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడు ట్రైబ్యునల్ కు ఎందుకు లేఖ రాశారో విజయమ్మ రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి పొలాలు లాక్కుని, ప్రత్యేక ఆర్ధిక మండళ్లకు (సెజ్) కట్టబెట్టడం వారి పాలిటం శాపం కాదా? అని లోకేష్ నిలదీశారు.

  • Loading...

More Telugu News