: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జీవీఎంసీ ఉద్యోగి
విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ జీవీఎంసీ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జీవీఎంసీ ప్రకటనల విభాగంలో పర్యవేక్షణాధికారిగా కనకరాజు పనిచేస్తున్నాడు. మల్కాపురంలో మెడికల్ క్యాంపుకు సంబంధించిన ప్రచారం కోసం 4 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు బృందం కనకరాజును అరెస్ట్ చేసింది.