: హోం శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన జైరాం రమేష్


జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ కేంద్ర హోం శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. న్యాయ శాఖ నుంచి కేంద్ర హోం శాఖకు చేరిన తెలంగాణ ముసాయిదా బిల్లుకు హోం శాఖాధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బిల్లుపై సాయంత్రం భేటీ కానున్న జీవోఎం సభ్యులకు ఏకాభిప్రాయం కుదిరితే దానిని ఆమోదించే అవకాశం ఉంది. కాగా రాయల తెలంగాణ అంశం తెరమీదికి రావడంతో ఏర్పడిన సంక్లిష్టతను నేటి జీవోఎం భేటీ ఛేదించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News