: దక్షిణాఫ్రికా పర్యటన నేర్చుకునేందుకు అవకాశం: ధోనీ


దక్షిణాఫ్రికా పర్యటన భారత బ్యాట్స్ మెన్ బాగా నేర్చుకునేందుకు అనువైనదిగా టీమిండియా కెప్టెన్ ధోనీ అన్నాడు. మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం భారత జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకుంది. తొలి వన్డే గురువారం జరగనుంది. పేస్, బౌన్స్ కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్ లపై గత పర్యటనల సందర్భంగా భారత జట్టు ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాట్స్ మెన్ సత్తాకు ఇదే అసలైన పరీక్షగా ధోనీ పేర్కొన్నాడు. వాస్తవానికి ఈసారి సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే యువకులతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై విజయం కోసం పోరాడనుంది.

  • Loading...

More Telugu News