: రాయల తెలంగాణకు నిరసనగా ఉస్మానియా వర్శిటీ విద్యార్థుల ఆందోళన
రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వర్శిటీలోని ఎన్.సీ.సీ. గేటు వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ బారికేడ్ల నుంచి దూకి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే విద్యార్థులు తలపెట్టిన బైక్ ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఖండిస్తూ టీఆర్ఎస్ రేపు బంద్ కు పిలుపునిచ్చిన నేపధ్యంలో, విద్యార్థులను అదుపు చేసేందుకు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.