: సచివాలయం ముట్టడికి యత్నించిన సీమాంధ్ర విద్యార్థులు


రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ.. సచివాలయాన్ని ముట్టడించేందుకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్ బాబుతో పాటు మిగిలిన వారిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News