: ఉత్తమ నటుడిగా పవన్ కల్యాణ్


వరుస విజయాలతో దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. 2012 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన ఫిల్మ్ అవార్డుల్లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను పవన్ ను ఉత్తమ నటుడిగా ఎంపికచేశారు. ఉత్తమ నటిగా ఇష్క్ సినిమాలో నటించిన నిత్యా మీనన్ ఎంపికైంది. ఆన్ లైన్ లో పోలింగ్ నిర్వహించిన హైదరాబాద్ టైమ్స్ అంతిమ విజేతలను ప్రకటించింది. హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తమ నటుడు : పవన్ కల్యాణ్ (గబ్బర్ సింగ్)

ఉత్తమ నటి : నిత్యా మీనన్ (ఇష్క్)

ఉత్తమ చిత్రం : ఈగ

ఉత్తమ యూత్ ఫిల్మ్ : ఇష్క్

ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (ఈగ)

ఉత్తమ గాయకుడు : దీపు (నేనే నానినె... ఈగ)

ఉత్తమ గాయని : సుచిత్ర (సారొస్తారా... బిజినెస్ మేన్)

ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ (గబ్బర్ సింగ్)

ఉత్తమ కామెడీ హీరో : అల్లరి నరేష్ (సుడిగాడు)

ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)

ఉత్తమ స్క్రీన్ ప్లే : తనికెళ్ల భరణి (మిథునం)

  • Loading...

More Telugu News