: చెన్నై చేరుకున్న వైఎస్ జగన్


వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సోదరుడు అనిల్ రెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుంటారు. అనంతరం ఆయన సమైక్యాంధ్ర సాధన కోసం తమిళనాడు సీఎం జయలలిత, డీఎంకె అధినేత కరుణానిధిని కలిసి మద్దతు కోరనున్నారు. ఈ రోజు రాత్రికి జగన్ చెన్నైలోనే బస చేస్తారు.

  • Loading...

More Telugu News