: విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద చంద్రబాబు మహాధర్నా
విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు మహాధర్నా ప్రారంభమైంది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన ధర్నా చేపట్టారు. ట్రైబ్యునల్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నాకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు.