: పెన్నులకు బ్లూ టూత్ లు .. కోకాపేటలో కాపీ చేస్తూ పట్టుబడిన విద్యార్థులు


హైదరాబాద్ లో హైటెక్ కాపీయింగ్ చేస్తూ ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. షాదన్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కోకాపేటలోని మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. అబ్దుల్ ఖదీర్, సయ్యద్ ఖాజాలు పెన్నులకు బ్లూటూత్‌లు అమర్చి మిత్రుల నుంచి సమాచారం అందుకుని సమాధానాలు రాస్తున్నారు. వారిద్దరి పెన్నులకు చిన్నగా లైటు వెలుగుతుండటాన్ని గమనించిన ఇన్విజిలేటర్ ఆరా తీయగా, కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. విద్యార్థులిద్దరినీ నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయట సమాచారం అందిస్తున్న వారు మాత్రం పరారయ్యారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News