: కంపెనీలు ఇకపై పార్టీలకు విరాళాలు ఊడ్చి పెట్టవచ్చు!


కంపెనీలు ఇక కోరుకుంటే తమ లాభాలను రూపాయితో సహా రాజకీయ పార్టీల విరాళాల జోలె సంచుల్లో కుమ్మరించవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కంపెనీల చట్టం 2013 అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీలు తమ వార్షిక నికర లాభంలో 7.5శాతానికి మించకుండా పార్టీలకు విరాళాలుగా ఇవ్వడానికి పరిమితి ఉండేది. ఇకపై ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలు విరాళాల విషయంలో చెలరేగిపోవచ్చు. వాటాదారుల లాభాలతో కంపెనీలు, పార్టీలు పండగ చేసుకుంటాయేమో!

  • Loading...

More Telugu News