: 'తెహెల్కా' ఎడిటర్ కు నేడు మరోసారి వైద్య పరీక్షలు
లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన 'తెహెల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు నేడు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఈ ఉదయమే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విచారణలో భాగంగానే తేజ్ పాల్ కు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, గతనెల 30న అదుపులోకి తీసుకున్న తర్వాత... డిసెంబర్ 1న తేజ్ పాల్ కు గోవా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో తొలిసారి లైంగిక పరీక్షలు నిర్వహించారు.