: బొత్సను పరామర్శించిన స్పీకర్
కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బొత్స ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో తల, గొంతు నొప్పితో బొత్స కేర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బొత్సకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వైద్యులు, ఆయన మెదడు నరాల్లో స్వల్ప సమస్య ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.