: సమయానికి తగు ఆహారంతీసుకుంటే మంచిది


సమయానికి తగు విధంగా ఆహారం తీసుకొంటే ఎలాంటి జబ్బులు మన దరిదాపులకు కూడా రావు. ఈ విషయం తెలిసినా తెలియనట్టే మనవారు పెద్దగా పట్టించుకోరు. దీంతో పలు రకాల రోగాల బారినపడి, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మగువలు సమయానికి ఆహారం తీసుకోరు. అందునా ఉదయం పూట టిఫిన్‌ అస్సలు తీసుకోరు. టైం అయిపోయందనో, లేదా టిఫిన్‌ చేస్తుంటే లేటు అవుతుందనో ఏవో కారణాల వల్ల ఉదయం అల్పాహారం తీసుకోకుండానే ఆఫీసుకు వెళ్లిపోతారు.

కొందరు రాత్రి 8 నుండి 9 గంటల మధ్య భోజనం చేసి పడుకుంటారు. ఇక ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ అస్సలు తీసుకోరు. ఆఫీసుకు వెళ్లిపోయి ఉదయం పది నుండి పదకొండు గంటలమధ్య తింటారు. అంటే రోజులో సగం సేపు రాత్రి 9 గంటల నుండి ఉదయం 9 గంటల వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా గడిపేస్తారు. తర్వాత మిగిలిన సగం రోజులోనే మొత్తం ఆహారాన్ని తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల దాని ప్రభావం మన జీర్ణవ్యవస్థపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట నిరాహారంగా ఉండడం వల్ల మన శరీరం పనిచేయడానికి కావాల్సిన శక్తి అందదు. దీనికితోడు మనం చేస్తున్న పనిలో మానసికపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇటు ఇంట్లో పిల్లలు కూడా మీరు చెప్పిన మాట వినకుండా పోవడం వంటివి సంభవిస్తాయి. ఈ కారణాలన్నీ కలిపి మీకు చిరాకు పెరిగిపోయి, అరుపులు, కేకలతో ఇల్లు దడదడలాడుతుంది. కాబట్టి వీటన్నింటికీ చక్కటి పరిష్కారం మీరు సరిపడినంతగా ఉదయంపూట అల్పాహారం తీసుకోవడం. చూశారా, మీరు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎన్ని అనర్ధాలో! కాబట్టి చక్కగా టిఫినీలు చేసి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి మరి!

  • Loading...

More Telugu News