: భారత్ లో జోరందుకున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు
భారత్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. సెల్ కాన్, కార్భన్, మైక్రోమ్యాక్స్ వంటి దేశీయ సెల్ ఫోన్ కంపెనీలు చౌక ధరలకే స్మార్ట్ ఫోన్లను అందించడంతో అమ్మకాలు మరింత పెరిగాయని ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఐడీసీ పేర్కొంది. గతేడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ లో 38 లక్షలున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది కోటి 28 లక్షలకు చేరాయి. అదే విధంగా మొత్తం మొబైల్ ఫోన్ల విక్రయాల్లో ఫీచర్ల ఫోన్ల వాటా 84 నుంచి 81 శాతానికి తగ్గింది. ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల మధ్య ధర వ్యత్యాసం తగ్గుతుండటంతో మొబైల్ వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు కొనేందుకే ఇష్టపడుతున్నారని కూడా ఐడీసీ సర్వేలో తేలింది.