: జీఎస్ఎల్వీ డి5 ప్రయోగానికి ముహూర్తం ఖరారు


జీఎస్ఎల్వీ డి5 ప్రయోగానికి ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది. 2014 జనవరి మొదటి వారంలో 'జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్'(జీఎస్ఎల్వీ డి5)ను ప్రయోగిస్తామని చెన్నైలో ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం కోసం అన్ని సన్నాహకాలు పూర్తి చేశామని.. ప్రయోగించే తేదీ, సమయాన్ని కూడా నిర్ణయించినట్లు పేర్కొంది. లాంచింగ్ వెహికల్ ను డిసెంబర్ 28న లాంచింగ్ ప్యాడ్ కు తీసుకొస్తామని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 19న చేపట్టిన ఈ ప్రయోగం ఇంధనం లీక్ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News