: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు లోపభూయిష్టం: చంద్రబాబు


బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు లోపభూయిష్టంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రైబ్యునల్ తీర్పు ప్రజలకు శరాఘాతంగా మారిందని అన్నారు. రాష్ట్రం తరఫున సమర్థుడైన న్యాయవాది వాదించకపోవడంవల్లే ఈ అనర్థం జరిగిందని చెప్పారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును ఎందుకు పెంచారో కూడా చెప్పలేని స్థితిలో మన న్యాయవాదులు ఉన్నారని విమర్శించారు. స్వార్థం కోసం వైయస్ రాజశేఖరరెడ్డి మిగులు జలాలు కోరమంటూ లేఖ రాశారని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర ప్రజల కష్టాలను పట్టించుకునే స్థితిలో లేరని అన్నారు.

  • Loading...

More Telugu News