: లక్షల స్థాయి నుంచి హైయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ గా ఎదిగిన కరప్షన్ కింగ్ జగన్: నారా లోకేష్
ఏడాదికి రూ. 9 లక్షల ఆదాయం కలిగిన వ్యక్తి... ఏకంగా దేశంలోనే ఎక్కువ ఆదాయపు పన్ను కట్టిన మూడో వ్యక్తిగా అవతరించాడని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను ఉద్దేశిస్తూ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. జగన్ ఓ కరప్షన్ కింగ్ అంటూ సంబోధించారు. తొమ్మిదేళ్లలోనే అతను తొమ్మిది లక్షల స్థాయి నుంచి దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఎదిగారని ఎద్దేవా చేశారు. తన విజయ రహస్యాన్ని జగన్ బయటపెడితే... భారత దేశంలో పేదరికమన్నది కేవలం చరిత్రలో ఒక భాగంగానే మిగిలిపోతుందని సెటైర్ విసిరారు.