: కాంగ్రెస్, కేసీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారు: మోత్కుపల్లి


రాయల తెలంగాణను తెరమీదకు తెచ్చి కాంగ్రెస్, కేసీఆర్ లు దొంగ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కేసీఆర్, సోనియాగాంధీలు కుట్రపన్నారని... అందుకే తెలంగాణ అంశాన్ని సాగదీస్తున్నారని ఆయన ఆరోపించారు. సంబరాలు, రథయాత్రలు చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు... వాటన్నింటినీ ఆంక్షలు లేని తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు తెలంగాణ ప్రకటించి, తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News