: అరవై లక్షలు దాటిన షారుక్ ట్విట్టర్ అభిమానగణం
హీరో షారుక్ ఖాన్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. దాంతో, ట్విట్టర్ లో ఈ బాద్షాను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య ఏకంగా అరవై లక్షలు (6 మిలియన్లు) దాటింది. దీనిపై కింగ్ ఖాన్ స్పందిస్తూ.. "ఆరు మిలియన్ల మంది అభిమానులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ సంఖ్య రూపంలో నాకు తెలుస్తోంది. ఈ ప్రేమ, అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి" అని ట్వీట్ చేశాడు.