: రాయల తెలంగాణపై మరో ట్విస్టు.. తనకేమీ తెలియదన్న షిండే


ఈ రోజు సాయంత్రం రాష్ట్ర విభజనపై తుది నివేదికను జీవోఎం సిద్ధం చేస్తున్న తరుణంలో, కేంద్ర హోంమంత్రి షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నివేదికను ఈ సాయంత్రం జీవోఎం ఆమోదిస్తుందని ఆయన తెలిపారు. అయితే, రాయల తెలంగాణపై తనకేమీ తెలియదని అన్నారు. షిండే వ్యాఖ్యలతో, రాయల తెలంగాణపై జీవోఎం ఇంకా మల్లగుల్లాలు పడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. కాగా, ఎల్లుండి కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు వస్తుందని షిండే చెప్పారు. జీవోఎం ఏర్పాటయినప్పటినుంచి, అందులోని సభ్యులు తలా ఒక విధంగా మాట్లాడటం, విషయాలపై క్లారిటీ ఇవ్వకపోతుండటం అందరికీ తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News