: టాలీవుడ్ బాలనటుడు తేజ గంగానదిలో గల్లంతు
పలు టాలీవుడ్ సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన తేజ ఈ రోజు గంగానదిలో గల్లంతయ్యాడు. హైదరాబాద్ కు చెందిన తేజ మహారాష్ట్రలో ఇంటర్ చదువుతున్నాడు. మిత్రులతో సరదాగా ఉత్తరప్రదేశ్ వెళ్లిన తేజ ఈత రాకపోవడంతో గంగానదిలో ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు.
తేజకు 2009లో నంది అవార్డు కూడా లభించింది. అయితే, తేజ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడంలేదని అతని కుటుంబ సభ్యులు వాపోయారు. తేజ ఆచూకీ కనుగొనడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అయినా చొరవ చూపాలని వారు కోరుతున్నారు.