: జగన్ అక్రమాస్తుల కేసు విచారణను జనవరి 10కి వాయిదావేసిన కోర్టు
జగన్ అక్రమాస్తుల కేసును నాంపల్లిలోని సీబీఐ కోర్టు జనవరి 10 కి వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్ పార్క్ కు సంబంధించిన కేసులో (10వ ఛార్జిషీట్) కొంత సేపు వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన, సబిత, మోపిదేవి, ఆడిటర్ విజయసాయితో పాటు మొత్తం 60 మంది ఈ రోజు విచారణకు హాజరయ్యారు. వీరిలో ఐఏఎస్ అధికారులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. ఇంత మంది ఒకేసారి కోర్టులో అడుగుపెట్టేసరికి, కోర్టు ప్రాంగణం మొత్తం కిటకిటలాడిపోయింది.