: హైదరాబాదులో 5 స్కూల్ బస్సులు సీజ్
వోల్వో బస్సు ప్రమాద ఘటన తరువాత రవాణా శాఖాధికారులు చేపట్టిన ఆర్టీఏ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని అత్తాపూర్ సమీపంలో ఇవాళ 5 స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. దీనికితోడు, మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 పాఠశాల బస్సులను సీజ్ చేశారు. అలాగే, గుంటూరు జిల్లాలో ప్రైవేట్ పాఠశాల, కళాశాలలకు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేసి 15 బస్సులను సీజ్ చేశారు. మరో 20 బస్సులపై కేసు నమోదు చేశారు.