: పది సార్లు ప్రధాని అయినా మోడీ '370'ని రద్దు చేయలేరు: ఫరూక్ అబ్దుల్లా


మోడీ పది సార్లు ప్రధానమంత్రి అయినా ఆర్టికల్ 370ని రద్దు చేయలేరని కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పాక్, భారత్ మాజీ సైన్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్, పాక్ కలిసి సామరస్యంగా ఉండాలన్నారు. పాక్ కాశ్మీర్ ను గెలవలేదని.. ఈ విషయాన్ని తన రక్తంతో రాసి చెప్పగలనన్నారు. మోడీ ఆదివారం జమ్మూ సభలో ఆర్టికల్ 370ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని, ప్రత్యేక హక్కులు, అధికారాలను దఖలు పరుస్తోంది.

  • Loading...

More Telugu News