: ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి 10 మంది పరారీ
హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక వ్యాధుల చికిత్సాలయం నుంచి 10 మంది విచారణ ఖైదీలు రాత్రి 10.30గంటల సమయంలో తప్పించుకుని పారిపోయారు. పురుషుల వార్డులో చికిత్స పొందుతున్న వీరు ఆక్సిజన్ సిలిండర్లతో గోడలను బద్దలు కొట్టుకుని మరీ జారుకున్నారు. అక్కడున్న గార్డులు ప్రాణభయంతో వారిని అడ్డుకోలేకపోయారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. వారిలో కొందరు పట్టుబడినట్లు సమాచారం.