: సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన


రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చివరిసారి ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు, వీరిద్దరు కూడా అందుబాటులో లేకపోవడంతో, కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఈ రోజు జగన్ కేసులకు సంబంధించి పదో ఛార్జిషీట్ పై విచారణ జరగనుంది. నేటి విచారణ కోసం గీతారెడ్డి, ధర్మాన, ఆడిటర్ విజయసాయితో పాటు ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలతో కలిపి మొత్తం 60 మంది కోర్టుకు హాజరయ్యారు. దీంతో, నాంపల్లి కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News