: జిహ్వచాపల్యం కట్టేసుకుంటే.. లావయిపోతారంతే!
ఓ చక్కటి నోరూరించే చాకొలేట్ కేక్ చూడగానే.. చటుక్కున కొరికేయాలనిపిస్తుంది. అయితే ఎక్కడ లావయిపోతామో.. అనే భయంతో దాని జోలికి వెళ్లకుండా ఉంటాం. నిజానికి ఈ ఊగిసలాటతో ఉండే ఒత్తిడి వల్ల కూడా లావయ్యే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికంటె కేక్ కనిపించగానే దాన్ని ఒక్కసారిగా తినేయడమే బెటర్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. తినడానికి గిల్టీగా ఫీల్ కావడం కూడా ఒబేసిటీని కలిగించే అంశం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
న్యూజిల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్‌బరీ వారి అధ్యయనం మాత్రం.. మానవ ప్రవర్తన యొక్క ప్రభావం కూడా చాలా కీలకం అని చెబుతోంది. పరిశోధకులు డాక్టర్ రోఎలిన్ కుయిజెర్, జెస్సికా బోయ్సే లు ఈ దిశగా పరిశోధనలు చేశారు. కేకుల్ని చూడగానే తినరాదని గిల్టీగా ఫీల్ కావడం ఏమైనా పనిచేస్తోందో లేదో తెలుసుకోవడానికి వారు 300 మంది వాలంటీర్లపై పరిశోధనలు చేశారు. 18-86 ఏళ్ల వయసు వారిని ఎంపిక చేసుకుని.. వారి ఆహారపుటలవాట్లు, సన్నబడాలనే కోరికల గురించి అడుగుతూ వచ్చారు. అలాగే చాక్లెట్ తినడం హేపీగా ఉంచుతుందా, గిల్టీగా ఉంచుతుందా అని కూడా అడిగారు. 27 శాతం మంది గిల్టీ అంటే 73 శాతం మంది హేపీ అని చెప్పారు.
18 నెలల తర్వాత ఫలితాల్ని పరిశీలిస్తే గిల్టీగా ఫీలయ్యే వారే ఎక్కువ బరువు పెరిగారు. కేకుల్ని సెలబ్రేషన్‌లో భాగంగా తింటున్న వారు వెయిట్‌లాస్ కావడంలో ముందంజలో ఉన్నారు. గిల్టీ అనే భావన కూడా బరువు పెరగడానికి కారణం అవుతుందని వారు నిగ్గు తేల్చారు. మనం ఏంతిన్నా సరే సంతోషంగా దాన్ని ఆస్వాదిస్తూ తింటే చాలునని, ఇతర ఇబ్బంది ఉండదని అధ్యయనం చెబుతోంది మరి!