: కెనడా చేపలను అమెరికాలో అమ్మిన వారికి ఒబామా క్షమాభిక్ష
అమెరికాలో కొందరు నేరస్తులకు ఆ దేశాధ్యక్షుడు ఒబామా క్షమాభిక్ష ప్రసాదించారు. వారిలో కెనడా చేపలను అమెరికాలో అమ్మిన వ్యక్తులూ ఉండడమే ఆసక్తికరం. వినడానికి ఇది వింతగానే ఉన్నా.. అమెరికా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే.
అమెరికా మత్స్యకారుల ఆదాయానికి గండికొట్టే ఏ చర్యనూ ప్రభుత్వం ఉపేక్షించదు. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. అందుకే అమెరికా అగ్రరాజ్యం అయిందని సూత్రీకరిస్తారు నిపుణులు. ఇదిలావుంటే, మొత్తం 17 మందికి ఒబామా క్షమాభిక్ష ప్రసాదించారు.
అయితే వీటిలో హింసకు సంబంధించిన కేసులేవీ లేవు. నకిలీ మనియార్డర్లు, ఫుడ్ కూపన్లను అక్రమంగా వినియోగించడం వంటి నేరాలకు పాల్పడిన కేసుల్లో ఒబామా తన విశేష అధికారాన్ని ఉపయోగించారు.