: రాష్ట్రపతితో ముగిసిన చంద్రబాబు భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. చంద్రబాబు వెంట టీడీపీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై రాష్ట్రపతికి ఎనిమిది పేజీల నివేదికను చంద్రబాబు సమర్పించారు. నదీ జలాల పంపిణీపై వచ్చిన ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ నేతలు చెప్పారు.