: బ్రిటన్ రాణి కన్నా సోనియానే ధనవంతురాలు!


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (18వ స్థానం), సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ (16వ స్థానం)కన్నా ధనవంతురాలిగా నిలిచారు! ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇరవైమందితో 'హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్' వెబ్ సైట్ ధనవంతుల జాబితా రూపొందించింది. ఆ వివరాల ప్రకారం.. ప్రపంచంలోని ధనవంతుల్లో సోనియా 12వ స్థానంలో నిలిచారు. 12వేల కోట్ల (2 బిలియన్ అమెరికన్ డాలర్లుతో) కు పైగా సంపదతో సోనియా ఈ స్థానంలో నిలిచినట్లు వెబ్ సైట్ వివరించింది. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, థాయ్ లాండ్ రాజు భూమిబోల్ అదుల్ యా దేజ్, బ్రూనై సుల్తాన్ హస్సానై బోల్కైలు టాప్ ప్లేస్ లో నిలిచారు.

  • Loading...

More Telugu News